Header Banner

ఆ రంగులు తొలగిస్తాం.. మంత్రి కీలక వ్యాఖ్యలు! అరసవెల్లిలో జరిగే వేడుకల్లో..

  Tue Feb 04, 2025 13:38        Politics

హిందూ ధర్మాలు, ఆలయాలను కాపాడాలనేది సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచన అని ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. హిందువులకు ఆరాధ్య దైవమైన శ్రీ సూర్యనారాయణ స్వామి పండుగే రథసప్తమి అని చెప్పారు. భూప్రపంచానికి సూర్యోదయంతోనే వెలుగులు నిండుతాయని అన్నారు. సీఎం చంద్రబాబు సూచనతో అరసవెల్లిలో జరిగే రథసప్తమి వేడుకలను, రాష్ట్రంలో జరిగే వేడుకలను ఈ ఏడాది రాష్ట్ర పండుగగా గుర్తించామని అన్నారు. అరసవెల్లిలో జరిగే వేడుకల్లో సీఎం చంద్రబాబు పట్టవస్త్రాలు సమర్పించాల్సి ఉందని... కానీ ఎన్నికల కోడ్ వల్ల అధికారులనే పట్టువస్త్రాలు సమర్పించాల్సిందిగా ఆదేశాలిచ్చామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గుర్తుచేశారు. నెల్లూరు మూలాపేట శివాలయంలోని సూర్యభగవానుడికు ప్రత్యేక పూజలు నిర్వహించామని అన్నారు. అనాధిగా తమ కుటుంబం రథసప్తమి పూజలు నిర్వహిస్తుందని వివరించారు.

 

ఇంకా చదవండి: సుమ బండారం బయటపెట్టిన యూట్యూబర్.. గంట షూటింగ్‌కొస్తే.. సోషల్ మీడియాలో వైరల్!

 

రాష్ట్రంలో పలు ఆలయాల పుననిర్మాణానికి నిధుల కేటాయింపులు జరుగుతున్నాయన్నారు. నెల్లూరు జిల్లాలో 18 ఆలయాల పున నిర్మాణాలకు రూ.38కోట్ల నిధులు విడుదలయ్యాయని ప్రకటించారు. మహాశివరాత్రి రోజున శ్రీశైలం, మహానంది, శ్రీకాళహస్తి, దాక్షారామంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. మూలాపేట శివాలయం అభివృద్ధికి మంత్రి నారాయణతో కలిసి ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. ఏపీలో రాతికట్టడాలకు గత జగన్ ప్రభుత్వంలో రంగులు వేయడం వల్ల పవిత్రతను కోల్పోయాయని తెలిపారు. ఆ రంగులు తొలగించి, వాటిని కాపాడుతామన్నారు. చరిత్ర, పవిత్రతను భవిష్యత్తు తరాలకు అందిస్తామని చెప్పారు. అందుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తాం. భక్తులు తమ ప్రభుత్వానికి అండగా ఉన్నారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.


ఇంకా చదవండి: జగన్ షాక్: సంచలనంగా మారిన షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ.. రాజకీయాలపై మూడు గంటలపాటు చర్చ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రియురాలి కోసం చైన్ స్నాచర్‌గా మారిన మాజీ MLA కొడుకు.. ఎంతకి తెగించాడురా.. అందరూ షాక్!

 

త్వరలోనే టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ పెళ్లి.. నిర్మాత ఆసక్తికర కామెంట్స్!

 

తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలపై కీలక అప్‌డేట్! బ్యాంకర్లతో సీఎం కీలక భేటీ!

 

పి అనే పదం పలకడం చేతకాని వైసీపీ నేతలు! ఓ రేంజ్‌లో ఫైర్ అయిన బీజేపీ నేత! ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తే..

 

వైసీపీకి షాక్‌ ఇచ్చిన నూజివీడు కౌన్సిలర్లు.. పట్టణంలో టీడీపీ హవా!

 

ఆ స్టార్ హీరో, డైరెక్టర్లు అవకాశాల పేరుతో పక్కలోకి రమ్మన్నారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన అనసూయ?

 

ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఏం తినాలి? ఎన్టీఆర్ ట్రస్ట్ ఇస్తున్న సలహా ఇదే!

 

తిరుమల రథసప్తమి ఘనోత్సవానికి టీటీడీ భారీ ఏర్పాట్లు! ఆ టోకెన్లు తాత్కాలికంగా నిలిపివేత!

 

సూర్య సినిమా ను ఫాలో అవుతున్న స్మగ్లర్లు! ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్!

 

ఫామ్ హౌస్‌లో భారీ పార్టీ... ఇద్దరూ ప్రమాదకరం.. బాబు పంచ్‌ మామూలుగా లేదుగా!

 

దేశవ్యాప్తంగా రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్! PMDDKY పథకం ఎలా ఉపయోగపడుతుందంటే?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi ##AnamRamanarayanaReddy #CM.ChandrababuNaidu #AndhraPradesh #APNews #LatestNews #TeluguNews